హాట్ ఎయిర్ బెలూన్లు అంత పైకి ఎలా ఎగురుతాయి?
పిల్లలు బెలూన్‌ను చూసి చాల సరదా పడుతుంటారు. అదే గ్యాస్ బెలూన్‌లను మరింతగా ఇష్టపడతారు. ఇక హట్ ఎయిర్ బెలూన్లను చూస్తే ఆ సంబరానికి హద్దులుండవు. దానికి కారణం అవి గాలిలో పైకి ఎగురుతూ ఉండడమే. ఇవి అంత పైకి ఎలా ఎగురుతాయో చూద్దాం.
హాట్ ఎయిర్ బెలూన్లలోని వాయువుని వేడి చేసిన కొద్దీ దానిలోని పరమాణువులు వేడెక్కుతాయి. పరమాణువుల మధ్య పదార్థం ఏదీ లేదు కాబట్టి గాలి తేలిక అయి వ్యాకోచిస్తుంది. ఇది బయట గాలి కన్నా తేలికగా ఉండటంతో బెలూన్ పైకి లేస్తుంది. లోపలి గాలి చల్లబడే వరకు అది పైకి వెళ్తుంది. లోపలి గాలి చల్లబడగానే అది బయట గాలితో సమానమై బెలూన్ పక్కకు కొట్టుకుపోతుంది. అందుకే హాట్ ఎయిర్ బెలూన్‌లో వేడి తగ్గకుండా మంట మండిస్తూ ఉంటారు. ఆ వేడి ఉన్నంతసేపూ బెలూన్ గాలిలో ప్రయాణిస్తూనే ఉంటుంది.