Monday, January 31, 2011

CCh అంటే ఏమిటి?

CCh అంటే ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రఫీ. మెదడులోని న్యూరాన్స్ అనే నరాల కణాలు ప్రసరించే విద్యుత్ స్థాయులను కొలిచి, విద్యుత్ చర్యలను రికార్డు చేయడాన్ని ఎలక్ట్రో ఎన్ సెఫలోగ్రఫీ (CCh) అంటారు. హాన్స్‌బర్గర్ అనే జర్మనీ శాస్తవ్రేత్త 1924 లో మొదటిసారిగా మనుషుల్లో ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్స్ (బ్రెయిన్ వేవ్స్)ని రికార్డ్ చేశాడు. అందుకోసం ఆయన ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్ అనే యంత్రాన్ని రూపొందించాడు. మెదడు చచ్చుబడినా, గాయం తగిలి దెబ్బతిన్నా మెదడు ఏ స్థాయిలో పనిచేస్త్తుందో తెలుసుకోవటానికి CCh యంత్రాన్ని వాడతారు.


వైద్య నిపుణులు ఈ యంత్రంలోని ఎలక్ట్రోడ్‌లను రోగి తలకు తగిలిస్తారు. అప్పుడది ముందుకీ, వెనక్కీ కదులుతూ యంత్రంలోని కాగితం మీద వరుసలు, గ్రాఫ్ ఆకారాలు గీస్తుంది.

ఇవి పరిశీలిస్తే మెదడులోని కార్యక్రమాల పనితీరు స్పష్టమవుతుంది. CCh ని కోమా స్థితిని, బ్రెయిన్ డెత్ స్థితిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఇంకా మెదడులో అపసవ్య రక్త ప్రసరణని, మెదడు పనితీరులోని తీవ్ర వ్యత్యాసాలను, మూర్ఛ రోగాన్ని పరిశీలించి పర్యవేక్షించడానికి కూడా CCh ని వాడుతుంటారు. అయితే ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్‌లు వచ్చిన తరవాత దీని వాడకం తగ్గింది.

0 comments:

About This Blog

Lorem Ipsum

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP