బంటిమామ తిక్క కుదిరింది
![]() |
అనగనగా ఒక అడవిలో ఒక ఎలుగు బంటి ఉండేది. అడవిలో ఏనుగు, సింహం, పులి తర్వాత తానే బలమైన జంతువునని భావిస్తుండేది. ఈ మూడు జంతువుల్ని జయిస్తే అడవికి తానే రాజు కావచ్చని ఎలుగుబంటి ఆశపడేది.ఒక రోజు ఎలుగుబంటి నక్క దగ్గరకు వెళ్లింది. నక్క ఎలుగుబంటిని చాలా మర్యాదగా ఆహ్వానించింది. అప్పుడు ఎలుగుబంటి నక్కతో ‘‘చూడు. నువు నన్ను ఎంత గౌరవంగా చూస్తున్నావో. ఈ అడవిలో ఆ మూడు జంతువులు తప్ప మిగిలిన జంతువులన్ని నన్ను గౌరవిస్తు న్నాయి.
ఆ మూడు జంతువుల్ని ఏ విధంగా ఎలా జయించాలి? ఏదైనా మంచి ఆలోచన చెప్పు’’ అంది. నక్క తన మనస్సులో ఎలుగుబంటి శక్తికి మించిన కోరిక కోరుకుంటోందని అనుకుంది. కానీ ధైర్యం చేసి పైకి చెప్పలేదు. ‘‘మనం ఈ విషయంలో తొందరపడి తప్పు చేయకూడదు. ఆలోచించి తగిన విధంగా నడుచుకోవాలి’’ అని చెప్పి తెలివిగా వాయిదా వేసింది నక్క. ముందు ఇద్దరం కలిసి అడవిలోకి వెళ్లి ఆ జంతువుల గురించి మిగిలినవి ఏమనుకుంటున్నాయో వాకబు చేద్దాం అని చెప్పింది నక్క.

ఎలుగుబంటి, నక్క కలిసి అడవిలోకి బయలుదేరాయి. కొంత దూరం అడవిలోకి వెళ్ళే సరికి వాటికి ఒక తేనె పట్టు కన్పించింది. ‘‘తేనె తిందామా మిత్రమా! తేనె అంటే నాకు చాలా ఇష్టం’’ అంది ఎలుగుబంటి. ‘‘మరి తేనెటీగల సంగతి’’ అని అడిగింది నక్క.‘తేనెటీగలు నాకో లెక్కా?’’ అని తన అహంకారాన్ని ప్రదర్శించింది ఎలుగుబంటి. ‘‘సరే’’ అంది నక్క. ఎలుగుబంటి తేనె పట్టు కోసం చెట్టెక్కింది. తేనె పట్టుపై ఉన్న వేలాది తేనెటీగలు ఒక్కసారిగా ఎలుగుబంటిని ముట్టడించాయి. అది చూసి నక్క పక్కకు తప్పుకుంది. తేనెటీగలు ఎలుగుబంటిని కుట్టిన చోట కుట్టకుండా విపరీతంగాకుట్టాయి. దాంతో ఎలుగుబంటి ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకు జీవుడా అనుకుంటూ తప్పించుకుని పారిపోయింది. ‘ఎలుగుబంటికి తన శక్తి ఏమిటో తెలిసి వచ్చింది’ అనుకుంది నక్క.
నీతి: మన శక్తిసామర్థ్యాలపై సరైన అంచనా లేకుండా ఏ పనికీ పూనుకోకూడదు.
నీతి: మన శక్తిసామర్థ్యాలపై సరైన అంచనా లేకుండా ఏ పనికీ పూనుకోకూడదు.

0 comments:
Post a Comment